తమిళనాడు ప్రభుత్వం, ఆలయాల నిర్వాహకుల మధ్య వివాదం చినికి చినికి గాలివాన చందంగా మారుతోంది. నేడు ఆస్తుల లెక్కపై దీక్షితుల వైఖరి పై ఉత్కంఠ నెలకొంది. తమిళనాడులో దీక్షితుల నిర్వహణలో వందలాది ఆలయాలున్నాయి. చిదంబరం ఆలయాల్లో దీక్షితులదే నిర్వహణ బాధ్యత. అయితే, ఇప్పటివరకు జోక్యం చేసుకోలేదు దేవాదాయ శాఖ. తాజాగా అధీనాలు, దీక్షితుల ఆధ్వర్యంలో ఉన్న ఆలయ ఆస్తుల లెక్కించాలని స్టాలిన్ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం వివాదానికి కారణం అవుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు అధీనాధిపతులు,…