న్యూయార్క్ టైమ్స్ కథనం నేపథ్యంలో పెగాసస్ దుమారం మరోసారి రేగింది. ఈ స్పైవేర్ ను భారత్ 2017లో ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వ్యంగ్యం ప్రదర్శించారు. పెగాసస్ స్పైవేర్ లో కొత్త వెర్షన్ లు ఏమైనా వచ్చాయేమో ఇజ్రాయెల్ ను కనుక్కోండి… ఇదే తగిన సమయం అంటూ సెటైర్ వేశారు. భారత్, ఇజ్రాయెల్ దేశాల సంబంధాల్లో కొత్త లక్ష్యాలు ఇప్పుడు నిర్దేశించుకోవచ్చు…