ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో.. అనుమలంకలో ఇప్పటికే 13 వేలకు పైగా కోళ్లు మృతి చెందటంతో కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కోళ్ల ఫారాల్లో తనిఖీలకు ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా.. జిల్లా వ్యాప్తంగా పౌల్ట్రీ ఫామ్‌లలో తనిఖీలు నిర్వహించి బర్డ్ ఫ్లూ పరిస్థితులను అంచనా వేయాలని పేర్కొన్నారు..