డబ్బుల కోసం కుటుంబాన్నే కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లాలో చోటుచేసుకుంది. డ్రగ్స్‌కు బానిసైన 24 ఏళ్ల యువకుడు తన తండ్రి డబ్బులు ఇవ్వలేదని.. తన తల్లిదండ్రులు, నానమ్మను చంపి వారి మృతదేహాలను కాల్చివేశాడు. ఈ ఘటన సింగ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుట్కా గ్రామంలో చోటుచేసుకుంది.
ఛత్తీస్‌గఢ్‌లో కొత్తగా ఏర్పాటైన మనేంద్రగఢ్-చిర్మిరి-భరత్‌పూర్ జిల్లా ప్రారంభోత్సవంతో మనేంద్రగఢ్ నివాసి రామశంకర్ గుప్తా సంకల్పం కూడా నెరవేరింది. ఆ సంకల్పం ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.