Delhi: వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కి మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఇండియా వ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ నెలకొంది. ఇండియా-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్ ఎదురుచూస్తు్న్నారు. ఆదివారం రోజున అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగబోతోంది. ఇప్పటికే భారత్‌లో పలు ప్రాంతాల్లో క్రికెట్ లవర్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మ్యాచ్‌ని ఆస్వాదించేందుకు విందు, వినోదాలను సెట్ చేసుకుంటున్నారు.