Chevireddy Bhaskar Reddy: విజయవాడ ఏసీబీ కోర్టు దగ్గర మరోసారి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హల్ చల్ చేశారు. రిమాండ్ పొడిగించిన తర్వాత జైలుకి తీసుకు వెళ్తుండగా మీడియాతో మాట్లాడారు. తనను అక్రమంగా లిక్కర్ కేసులో ఇరికించారని.. తనకు లిక్కర్ స్కాంకు ఎటువంటి సంబంధం లేదన్నారు. కేసులో సిట్ అధికారులు అక్రమంగా ఇరికించారు, ఈ విషయం సిట్ కి కూడా తెలుసన్నారు. తన తండ్రి లిక్కర్ తాగి చనిపోయారు తాను లిక్కర్ జోలికి వెళ్ళనని…