hevella MP Ranjith Reddy: ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌కు మరో సంచలన షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మరో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపారు.
చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిపై పోలీస్ కేసు నమోదు అయింది. మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై దుర్భాషలాడిన ఘటనలో ఎంపీ రంజిత్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఎంపీ రంజిత్ రెడ్డి తనకు ఫోన్ చేసి తిట్టారని.. బెదిరింపులకు పాల్పడినట్లు మాజీ ఎంపీ ఆరోపించారు.