చెరువుగట్టు బ్రహ్మోత్సవాల నిర్వాహణపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రివ్యూ చేశారు. రెండవ శ్రీశైలంగా పేరొందిన పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం, చెరువుగట్టు బ్రహ్మోత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవ్వాల సచివాలయంలో చెరువుగట్టు బ్రహ్మోత్సవాల నిర్వాహణపై నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, దేవాదాయ శాఖ కమీషనర్ అనిల్ కుమార్, ఇతర అధికారులతో బ్రహ్మోత్సవాల నిర్వాహణపై సమీక్ష నిర్వహించిన మంత్రి.. అధికారులకు పలు సూచనలు చేశారు. సచివాలయంలోని తన ఛాంబర్…