కరోనాను కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ రోడ్లపై తిరుగుతున్న ఆకతాయిల పనిపట్టారు మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండల ఏసిపి నరేందర్. రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా చెన్నూరు పోలీసులు ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపైకి రావద్దంటూ పలుమార్లు చెప్తున్నా వినట్లేదు. దీంతో ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్న వారి వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. అయినా చాలా మందిలో మార్పు రావడం లేదు. దీంతో కరోనా సోకుతుందని…