ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపిస్తున్నాడు. ఆదివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. మైదానం నలువైపులా ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. దీంతో 57 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో 99 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ క్రమంలో ఓవరాల్‌గా ఐపీఎల్‌లో వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. కేవలం 31 ఇన్నింగ్స్‌లలోనే రుతురాజ్ వెయ్యి పరుగులు సాధించాడు.…