చేజర్ల మండలంలోని కాకివాయి గ్రామంలో ప్రజలంతా ఒకే నిర్ణయం తీసుకొని.. గ్రామ అభివృద్ధికి సహకరిస్తుంటారు. గతంలో పలుమార్లు ఈ గ్రామంలో ఎన్నికలు లేకుండా సర్పంచులు ఎన్నుకున్నారు. ప్రస్తుతం అసెంబ్లీతో పాటు, లోక్‌సభ ఎన్నికలు రావడంతో తాము ఓట్లు అమ్ముకోబోమంటూ.. గ్రామస్తులు.. ఊరంతా వేసిన గోడపత్రాలు.. ఫ్లెక్సీలు ఆకట్టుకుంటున్నాయి.