గత యేడాది ఇదే ఫిబ్రవరి నెల 21న విడుదలైన ‘భీష్మ’ మూవీ నితిన్ ను సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. ఆ తర్వాత కరోనా కారణంగా థియేటర్లు మూత పడటంతో ఆ సినిమా సూపర్ హిట్ రేంజ్ కు వెళ్ళకుండానే ఆగిపోయింది. అయితే దాని కంటే ముందే నితిన్ పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నిజానికి అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే లాస్ట్ ఇయర్ నితిన్ నటించిన మూడు నాలుగు సినిమాలు విడుదలై ఉండేవి. కానీ కరోనా…