Ganja Smuggling: భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద గంజాయి స్మగ్లర్లు మరింత రెచ్చిపోతున్నారు. తాజాగా గంజాయిని తరలిస్తూ, తనిఖీల్లో ఉన్న కానిస్టేబుల్‌ను ఢీకొట్టి పరారైన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో కానిస్టేబుల్ యోగేంద్ర చారి తీవ్రంగా గాయపడ్డారు. అతనికి ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ తెల్లవారుజామున భద్రాచలం బ్రిడ్జి చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తున్న స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ యోగేంద్ర చారిపై గంజాయి స్మగ్లర్లు బైక్‌తో దాడి చేశారు.…