JD Vance Erika Kirk: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ వారం ప్రారంభంలో టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ క్యాంపస్ ఈవెంట్‌లో జేడీ వాన్స్ మాట్లాడుతూ.. తన భార్య ఉషా వాన్స్ హిందూ మతం నుంచి క్రిస్టియానిటీని స్వీకరిస్తుందని చెప్పారు.
Rising Political Violence Among U.S. Youth: అమెరికన్ యువతలో కోపం పెరుగుతుందా? ఆ దేశంలో రాజకీయ హత్యలు పెరుగుతన్నాయా? ప్రస్తుతం ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిజానికి, గత వారం డొనాల్డ్ ట్రంప్‌కు దగ్గరగా ఉన్న మితవాద నాయకుడు చార్లీ కిర్క్ హత్యకు గురయ్యాడు. హంతకుడు టైలర్ రాబిన్సన్ 22 ఏళ్ల యువకుడు. రాజకీయాలపై విపరీతమైన ఆసక్తి పెంచుకున్నాడు. ఈ క్రమంలో ట్రంప్ మిత్రుడైన చార్లీ కిర్క్ వ్యవహార శైలి అతడికి నచ్చలేదు. అందుకే హత్య…
Charlie Kirk: డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడైన చార్లీ కిర్క్‌ను కాల్చి చంపిన నిందితుడిని అరెస్ట్ చేశారు. ఉటాకు చెందిన 22 ఏళ్ల టైలర్ రాబిన్సన్‌ను నిందితుడిగా గుర్తించినట్లు ఉటా గవర్నర్ స్పెన్సర్ జె కాక్స్ తెలిపారు. నిందితుడు ఇటీవల కాలంలో రాబిన్సన్ ‘‘రాజకీయంగా తీవ్రంగా ప్రభావితం అయ్యాడు’’ అని గవర్నర్ చెప్పారు. ముఖ్యంగా, చార్లీ కిర్క్ నమ్మకాలను వ్యతిరేకిస్తున్నాడని, హత్య చేసింది తానే అని తన ఫ్యామిలీ ఫ్రెండ్‌కు చెప్పినట్లు వెల్లడించారు.