రాష్ట్రంలో వైసీపీ నేతల దాడులు దారుణంగా వున్నాయని మండిపడ్డారు టీడీపీ నేతలు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాల పై దాడులా? ఇదెక్కడి అన్యాయం..ముఖ్యమంత్రి గారూ ఒక్కసారి ఆలోచించండి అన్నారు టీడీపీ నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ప్రజా సమస్యల దృష్టి మరల్చడానికే ఈ చర్యలా.. !? అని గంటా ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతల కార్యాలయాలు, ఇళ్లపై అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు దాడి చేయడం అమానుషమైన చర్య…