తెలంగాణ రాష్ట్రంలో 2019 తర్వాత మళ్లీ డెంగీ కేసులు గణనీయంగా పెరుగుతుందని వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈనేపథ్యంలో.. ఇదే అదనుగా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు చికిత్స పేరిట రూ.లక్షలు వసూల్ చేస్తున్నాయని సమాచారం. అనవసరంగా.. ప్లేట్‌లెట్లు ఎక్కిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ తరహా ఫిర్యాదులుంటే 9154170960 నంబరుకు ఫిర్యాదు చేయాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. ఇక రాష్ట్రంలో డెంగీ విజృంభిస్తోంది. ఇప్పటికే 1,300 డెంగీ కేసులు నమోదు కాగా, హైదరాబాద్‌లో అత్యధికంగా 600 దాటాయి. జూన్…