తెలుగు చిత్రసీమలో భీష్మాచార్యుడు అని పేరున్న నిర్మాత డి.వి.ఎస్.రాజు. ఆయన నిర్మాణ సంస్థ ‘డి.వి.ఎస్.ప్రొడక్షన్స్’కు జనాల్లో మంచి ఆదరణ ఉండేది. ఆ సంస్థ నిర్మించిన అనేక చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. డి.వి.ఎస్. ప్రొడక్షన్స్ చిరంజీవి హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘చాణక్య శపథం’. విజయశాంతి నాయికగా నటించిన ఈ చిత్రం 1986 డిసెంబర్ 18న విడుదలయింది. ‘చాణక్య శపథం’ కథ విషయానికి వస్తే – కస్టమ్స్ ఆఫీసర్ చాణక్య నీతికి, నిజాయితీకి విలువనిచ్చే మనిషి.…