Off The Record: చిత్తూరు జిల్లా వైసిపి నేతలకు ఇప్పుడు పెద్ద కష్టం వచ్చిపడింది. తమిళ సూపర్ స్టార్ తలైవా తలనొప్పి తప్పదనే టాక్ నడుస్తోంది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిదిగా విచ్చేసిన రజనీకాంత్ టిడిపి అధినేత చంద్రబాబుపై ప్రశంసలు కురిపించటం రాజకీయ ప్రకంపనలు దారి తీసింది. ఐతే ఇది అధికార వైసిపికి ఏమాత్రం మింగుడుపడటంలేదట. చంద్రబాబు లాంటి వెన్నుపోటు దారుడికి మద్దతుగా మాట్లాడుతారా?అంటూ మంత్రి రోజా, కొడాలి నాని, అంబటి, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి…