మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం పెద్ద స్కామ్ అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వమే జీతం చెల్లిస్తుందని.. కానీ నిర్వహణ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటుందన్నారు. ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టలేరా? అని ప్రభుత్వాన్ని జగన్ప్రశ్నించారు. ఖర్చు చేయకపోతే మెడికల్ కాలేజీలను అలానే వదిలేయండని.. తాము అధికారంలోకి వచ్చాక పూర్తిచేస్తామన్నారు. వైసీపీకి ఎక్కడ క్రెడిట్ వస్తుందేమోనని పేదలకు నష్టం చేయడం సరికాదన్నారు. సీఎం చంద్రబాబు కొత్త స్కామ్‌లు…