CM Chandrababu Delhi visit: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర అనుమతులు, ఆర్థిక సహకారం అంశాలపై ఈ భేటీల్లో విస్తృతంగా చర్చ జరగనుంది. ప్రధానంగా “పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్ట్”కు అవసరమైన కేంద్ర అనుమతులు, అలాగే రాష్ట్రంలోని జాతీయ రహదారులతో ఏపీ రాజధాని అమరావతికి రహదారి అనుసంధానం అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. కేంద్ర…