టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి.. వరుసకు వదిన, మరిది అవుతారు. వీరిద్దరూ చెరొక పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. పురంధేశ్వరి ఇప్పటి వరకు చంద్రబాబును డైరెక్ట్‌గా విమర్శించిన దాఖలాలు లేవు. కాంగ్రెస్‌లో ఉన్నా, బీజేపీలో ఉన్నా.. టీడీపీ అధినేతపై విమర్శలు చేయలేదు. ఎన్నడూ చంద్రబాబు పేరు కూడా ఎత్తలేదు. ఇప్పడు పరిస్థితి వేరు.