Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకోట కార్ బాంబ్ బ్లాస్ట్‌కు కారణమైన ఉగ్ర డాక్టర్ ఉమర్ నబీ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ లోని అనంత్‌నాగ్ మెడికల్ కాలేజీ(జీఎంసీ)లో పనిచేస్తున్నప్పుడు అతడి విపరీత ప్రవర్తనను గురించి సిబ్బంది గుర్తు చేసుకున్నారు.
Delhi Car Blast: వారం క్రితం ఢిల్లీ లోని ఎర్రకోట వద్ద కారు బాంబ్ పేలింది. ఈ ఘటనలో 13 మంది మరణించారు. బాంబర్ డాక్టర్ ఉమర్ నబీ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ‘‘వైట్ కాలర్’’ మాడ్యూల్‌గా పిలువబడుతున్న ఈ ఉగ్రదాది వెనకాల ఫరీదాబాద్ అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్లు సూత్రధారులుగా ఉన్నారు.