తెలంగాణ బీజేపీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, చంపాపేట్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి శనివారం (జనవరి 24) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మధుసూదన్ రెడ్డి, నానక్‌రాంగూడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే శనివారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త విన్న బీజేపీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మధుసూదన్ రెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు, బీజేపీ…