గతంతో పోలిస్తే ఎండాకాలం చుర్రుమనిపిస్తోంది. సమ్మర్ ఎఫెక్ట్ తో తెలంగాణలో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో మండుతున్న ఎండలతో ప్రాణాలు పోతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రం లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదు కావడం విశేషం. ఆదిలాబాద్ జిల్లా చెప్రాలలో 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయిందంటే ఎండల తీవ్రత ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. వడదెబ్బకు గురై మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వడదెబ్బతో ఇద్దరు…