తెలుగు చిత్రసీమ ఎదుగుదల క్రమం చూసి ప్రాంతీయ, చిన్న దేశాల చలన చిత్ర నిర్మాణ సంస్థలు, సాంకేతిక నిపుణులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని నేపాలీ నటుడు భువన్ కె.సి. అన్నారు. ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేపాల్ ఫిల్మ్ ప్రమోషన్ సర్క్యూట్ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు.