Central Govt Ban State Power Purchases Telangana: విద్యుదుత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించలేదన్న కారణంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 13 రాష్ట్రాల డిస్కంల రోజువారీ కరెంటు కొనుగోళ్లపై కేంద్రం గురువారం అర్ధరాత్రి నుంచి నిషేధం విధించింది. ఇకపై డిస్కంలు ఇంధన ఎక్స్చేంజి ద్వారా విద్యుత్ కొనుగోలు, మిగులు కరెంట్ అమ్మకాలకు అవకాశం ఉండదు. దీనివల్ల తలెత్తే లోటు కారణంగా తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు విధించే అవకాశం ఉంది. దీంతో అధికారులు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు.…