పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో కేంద్ర నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జమ్మూ కాశ్మీర్‌లో పానీపూరి బండి నడుపుకునే వ్యక్తికి తెలిసిన సమాచారం కూడా కేంద్ర నిఘావర్గాలకు తెలియడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇక, పహల్గామ్‌లో దాడి చేసిన ఉగ్రవాదులను వెంటనే పాకిస్తాన్ అప్పగించాలని డిమాండ్ చేశారు.. ఆ ముగ్గురు ఉగ్రవాదులను అప్పగించిన తర్వాతనే పాక్‌తో భారత్ చర్చలకు వెళ్లాలని సూచించారు.. ఉగ్రవాదులను అంతం…