విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాక తొలి సందర్శనకు వెళ్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. రేపు తొలి సారి ప్లాంట్ సందర్శన కోసం కేంద్రమంత్రి కుమారస్వామితో కలిసి వెళ్తున్నట్లు చెప్పారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం.. కార్మిక సోదర సలహాలు తీసుకునేందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు.