అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కరెంట్ కోతలు అధికంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ ప్రభుత్వాస్పత్రిలో జనరేటర్ కూడా పనిచేయడం లేదు. దీంతో అర్ధరాత్రి 11 గంటల సమయంలో కృష్ణదేవిపేట నుంచి వచ్చిన ఓ గర్భిణీ పురిటినొప్పులతో బాధపడింది. కరెంట్ లేకపోవడంతో సెల్‌ఫోన్ లైట్ల మధ్యనే వైద్యులు ఆమెకు డెలివరీ చేశారు. ఆ సమయంలో గ్రామంలో ఆస్పత్రి స్టాఫ్‌కు కొవ్వొత్తులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ప్రసూతి విభాగంలో ఉన్న చంటిబిడ్డ తల్లులు, అప్పుడే పుట్టిన పిల్లలు…