భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి మనుస్మృతి ని మళ్ళీ ఆచరణలో పెట్టేందుకు జరుగుతున్న పెద్దకుట్రనే సీబీఎస్ఈ సిలబస్ లో మహిళల ఎదుగుదలపైన చేసిన వ్యాఖ్యలని పేర్కొంటూ, వాటిని ఎస్టీఎఫ్ఐ కేంద్ర కార్యవర్గ సమావేశం తీవ్రంగా ఖండించింది. విద్యా విషయక పాఠ్యాంశాల్లో ఆధిపత్య, అహంకార భావజాలాలను ప్రవేశపెట్టి మహిళలను కించపరుస్తూ అన్ని సమస్యలకూ మూలం మహిళలే అని ప్రచారం చేయడం అప్రజాస్వామిమని, రాజ్యాంగ మౌలిక లక్ష్యమైన లింగ సమానత్వాన్ని గౌరవించని వ్రాతలకు పాఠ్యాపుస్తకాల్లో అవకాశం కల్పించాలని ఎస్టీఎఫ్ఐ డిమాండ్…