Tirupati Laddu Row: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యిని వినియోగించారనే అభియోగాలపై నమోదైన కేసులో దర్యాప్తు వేగవంతం అయింది. సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సభ్యులు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, సీబీఐ డీఐజీ మురళీ రాంబా తిరుపతి సిట్ కార్యాలయానికి చేరుకుని సీబీఐ డైరెక్టర్ నియమించిన కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు.