తనకు తాను కమ్మ ప్రతినిధిగా ప్రకటించుకున్న మంత్రి పువ్వాడ అజేయ్ తీరు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చగా మారింది. ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి. రాష్ట్రానికి అంతటికీ మంత్రి. కానీ.. ఇలా ఒక కులానికి ప్రతినిధిగా చెప్పుకోవడం ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ పువ్వాడ అజేయ్ రాష్ట్రానికి మంత్రిగా ఉన్నారా? లేక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారా? లేకపోతే ఒక కులానికి మంత్రిగా ఉన్నారా? ఖమ్మంలో మినిస్టర్ కామెంట్స్ విన్నాక వినిపిస్తున్న ప్రశ్నలివే. బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఆత్మహత్యతో మంత్రి…