తెలంగాణ ప్రభుత్వం పంపిన రిజర్వేషన్ల బిల్ ఆమోదించకుండా ఆలస్యం చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. విద్య ఉపాధి అంశాలతో పాటు, స్థానిక సంస్థల రిజర్వేషన్ల రెండు బిల్లులను ఆమోదించడం లేదన్నారు. నేడు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు లేవని.. మతాలు ప్రాతిపదిక కాదన్నారు.