భారతీయ కార్ మార్కెట్‌లో ఎస్‌యూవీ కార్లకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది.. ఈ దృష్ట్యా, హ్యుందాయ్ తన కొత్త SUV ఎక్స్‌టర్‌ను త్వరలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే ఈ కారు పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రత్యామ్నాయ ఇంధనంతో నడిచే వెహికిల్స్ వైపు దృష్టిసారిస్తున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లో సందడి చేస్తుండగా.. ఛార్జింగగ్ పాయింట్ల కొరత ఉండటంతో పాటు ఛార్జింగ్ అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుండటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే పెట్రోల్ వేగంగా ప్యూయల్ నింపుకొని వెళ్లగలిగే కార్ల విషయానికొస్తే CNG ఒక ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు.
షియోమి నుంచి 2024లో మొదటి ఎలక్ట్రిక్ వాహనంతో పాటు ఉత్పత్తిని ప్రారంభిస్తుందని వెల్లడించింది. చైనా వార్షిక పార్లమెంటరీ సమావేశంలో మాట్లాడుతున్న షియోమి సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ లీ జున్ ఈ టాపిక్ ను వెల్లడించారు. 2022 నాటికి కంపెనీ తన ఈవీ వెంచర్ లో మూడు బిలియన్ యువాన్లను(434.3 మిలియన్ డాలర్లు ) పెట్టుబడి పెట్టిందని, కంపెనీ తన సమయంలో సగ భాగం షియోమీ ఈవీ కారు వ్యాపారం గురించే ఖర్చు చేస్తోందని ఆయన తెలిపారు.
తెలంగాణలో కీసర పోలీస్ స్టేషన్ పరిధి ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంజ్ కార్ AP 09 BU 0990 కార్ అదుపు తప్పి డివైడర్ ఢీ కొట్టింది. అదే వేగంతో.. ఎదురుగా వస్తున్న మరో కార్ TS 05 UC 4666 టాటా విస్టాను ఢీ కొట్టడంతో దీంతో ఇద్దరు స్పాట్ లోనే చనిపోయారు.
హోండా సిటీ, హోండా అమేజ్, హోండా డబ్ల్యుఆర్-వీల (ఫ్లాగ్‌షిప్ మోడల్స్) ధరలను పెంచామని హోండా కార్స్ ఇండియా ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత ఇది రెండో సారి పెంచారు. మోడల్‌ను బట్టి ధరల పెరుగుదల రూ.11,900 నుండి రూ.20వేల మధ్య ఉంటుంది. హోండా డబ్ల్యూఆర్వీ ఎస్‌యూవీ పెట్రోల్ వేరియంట్ రూ.11,900 పెరిగింది. డీజిల్ వేరియంట్‌కు ఇక నుంచి రూ.12,500 ఎక్కువ చెల్లించాలి. హోండా డబ్ల్యూఆర్వీ ప్రస్తుత ధర రూ.8.88 లక్షల నుండి రూ.9 లక్షలు (ఎక్స్-షోరూమ్)…
రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్నది. రెండు దేశాల మధ్య యుద్ధమే అయినప్పటికీ దాని ప్రభావం ప్రపంచ దేశాలపై తీవ్రస్థాయిలో పడింది. ఇప్పటికే కరోనా కారణంగా పెద్ద మొత్తంలో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్ని మరింత అతలాకుతలం చేసింది. ఈ యుద్ధం కారణంగా ఆయిల్, నిత్యవసర ధరలతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు, స్మార్ట్ ఫోన్లు, ఈవీ వాహనాల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.…
టెస్లా కంపెనీ భారత్ లోకి అడుగుపెట్టాలని చాలా కాలంగా చూస్తున్నది. అయితే, టెస్లా కార్లలో వినియోగించే పార్ట్స్ లో 10 నుంచి 15 శాతం మేర ఇండియాలో తయారైన వాటిని వినియోగించాలని, అప్పుడే రాయితీలు ఇస్తామని గతంలో భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇండియాలో ప్లాంట్ పెట్టే విషయంలో రాయితీలు ఇవ్వాలంటే గైడ్‌లైన్స్ పాటించాల్సిందేనని భారత ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో టెస్లా కంపెనీ కార్లను ఇండియాకు తీసుకొచ్చేందుకు వెనకడుగు వేస్తూ వస్తున్నారు. తాజాగా టెస్లాకు ప్రభుత్వం…
ప్రముఖ కంప్యూటర్, మొబల్ ఫోన్ల తయారీ దిగ్గజం యాపిల్ సంస్థ ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించేందుకు సిద్దం అవుతున్నది. యాపిల్ అటోనమస్ పేరుతో ఈ కారును తయారు చేసింది. భారత సంతతికి చెందిన దేవాంగ బొర అనే మెకానికల్ ఇంజనీర్ ఈ కారును డిజైన్ చేశారు. పెద్దని గుండ్రంగా ఉన్న గోళం దానికి నాలుగు చక్రాలు ఉన్న అటోనమస్ చూసేందుకు అచ్చంగా పిల్లలు ఆడుకునే బొమ్మలా ఉన్నది. ఈ ఎలక్ట్రిక్ కారుకు డ్రైవర్ అవసరం లేదు.…