US Diplomats Drive Auto: బుల్లెట్ ప్రూప్ కార్లు వదిలి.. ఆటో నడిపిన ఫారినర్స్ ఇంతలోనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Diplomats Drive Auto: అతిథి దేవో భవ అన్నది మన సంస్కృతి. మన దేశంలోకి ఎవరైనా పర్యాటకులు వచ్చారంటే వారికి పూర్తి భద్రత కల్పిస్తుంది ప్రభుత్వం. అదే వీఐపీలు వస్తే కట్టుదిట్టమైన భద్రత కల్పించి వారు దేశాన్ని వదిలివెళ్లేంత వరకు కంటికి రెప్పలా చూసుకుంటుంటారు. అదే దౌత్యవేత్తలు వస్తే వారి భద్రత గురించి ప్రభుత్వాలకు ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కూడా కేటాయిస్తుంది. వాళ్లు అత్యంత భద్రత మధ్య ఉంటారు. అందుకే మన దేశాన్ని చూసేందుకు విదేశీయులు ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ క్రమంలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో నలుగురు అమెరికా మహిళా దౌత్యవేత్తలు వీటన్నింటినీ వదిలేసి సామన్యుల్లా తిరిగారు. తమ బుల్లెట్ ప్రూఫ్ కార్లు వదిలేసి, ఆటోరిక్షాల్లో తిరిగారు. ఏదో ఊరికే సిటీ అంతా తిరగడం కాకుండా, అధికారిక కార్యక్రమాలకు కూడా ఆటోలోనే హాజరయ్యారు. అంతేకాదు.. ఆటోను నడిపింది కూడా వాళ్లే. ఈ విషయంపై దౌత్యవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు.
Read Also: Dowry Harassment: వద్దన్నా వదల్లేదు.. కత్తితో గొంతు కోసి చంపి గోనెసంచిలో పెట్టి..
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
- Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్‌లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
అమెరికాకు చెందిన అన్ ఎల్ మేసన్, రూత్ హోంబర్గ్, షరీస్ జె కిట్టర్‌మ్యాన్, జెన్నిఫర్ బైవాటర్స్ అనే నలుగురు మహిళా దౌత్యవేత్తలు ఢిల్లీలో అధికారిక హోదాలో పని చేస్తున్నారు. వారికి ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ కార్లు కూడా కేటాయించింది. అయితే, ఆ కార్లు వదిలేసి సాధారణ ప్రజల్లా ఆటోలో తిరిగారు. ఢిల్లీ వీధుల్లో ప్రత్యేకంగా కనిపించే పింక్ కలర్ ఆటోతోపాటు, బ్లాక్ కలర్ ఆటోలో నలుగురూ ప్రయాణించారు. ఇవి సాధారణ పర్సనలైజ్డ్ ఆటోలు. వీటిలో బ్లూటూత్ డివైజ్ వంటి సాధారణ ఫీచర్లు మాత్రమే ఉంటాయి. ఈ ఆటోల్లో వాళ్లు ఢిల్లీ వీధుల్లో చక్కర్లు కొట్టారు. ఇలా సాధారణ పౌరుల్లాగా ఆటోలో తిరిగే అవకాశం రావడంపై వాళ్లు సంతోషం వ్యక్తం చేశారు. దౌత్యవేత్తలు చేయాల్సింది స్థానిక ప్రజలతో సంబంధాలు పెంచుకుంటూ, ఒకరి గురించి ఇంకొకరు తెలుసుకోవడమే అని, ఆటోలో తిరగడం ద్వారా తాము చేసింది అదేనని వాళ్లు చెప్పారు.
U.S. diplomats in New Delhi drive tuk tuks instead of cars, say it's liberating to get around in a three-wheeler pic.twitter.com/4MWJWpAmGK
— Reuters (@Reuters) November 24, 2022
తాజావార్తలు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
-
Alias Rukmini : నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
-
Prabhas – Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!