ఈ మధ్య చిన్నాపెద్దా తేడా లేకుండా గుండెపోటులు రావడం కలవరం రేపుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఒక ప్యాసింజర్ హఠాత్తుగా కుప్పకూలిపోయాడు.
ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు టెర్మినల్ 2 వద్ద గుండెపోటు వచ్చి అకస్మాత్తుగా కుప్పకూలిన ఓ వృద్ధుడిని ఒక వైద్యురాలు కాపాడింది. కార్డియాక్ అరెస్ట్‌తో కుప్పకూలిన సెకన్ల వ్యవధిలో స్పందించి సీపీఆర్ చేసి ఆయన ప్రాణాలను రక్షించింది.