ఖమ్మంలో బుధవారం ‘కార్బైడ్ రహిత మామిడి మేళా’ను వనజీవి రామయ్య ప్రారంభించారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామానికి చెందిన రైతు బానోతు లక్ష్మణ్‌నాయక్ పెవిలియన్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న మేళాలో సహజసిద్ధంగా పండిన వివిధ రకాల మామిడి పండ్లను సరసమైన ధరలకు ప్రజలకు అందిస్తున్నారు. మేళాను ప్రారంభించిన అనంతరం రామయ్య మాట్లాడుతూ కార్బైడ్ రహిత మామిడి పండ్లను తినడం ఆరోగ్యానికి మంచిదని, కృత్రిమ పదార్థాలతో పండిన మామిడి పండ్లను నివారించాలని, అవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని…