Car Prices Slash: పండుగ సీజన్‌కు ముందే శుభవార్త.. కార్లపై రూ. 60 వేల నుంచి 3.49 లక్షల వరకు తగ్గింపు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Car Prices Slash: కేంద్రప్రభుత్వం ఇటీవల జీఎస్‌టీ రేట్లను క్రమబద్ధీకరించిన నేపథ్యంలో దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు తమ కార్ల ధరలను గణనీయంగా తగ్గించాయి. కొత్త జీఎస్‌టీ విధానం సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వస్తుంది. ఈ తగ్గింపులు ఎంట్రీ-లెవల్ కార్లపై రూ. 60,000 నుండి ప్రీమియం ఎస్‌యూవీలపై రూ. 3 లక్షలకు పైగా వరకు ఉన్నాయి. టాటా, మహీంద్రా, టయోటా, హ్యుందాయ్ వంటి ప్రధాన సంస్థలు ఇప్పటికే కొత్త ధరలను ప్రకటించగా.. త్వరలో కియా, మారుతి సుజుకీ కూడా ఈ జాబితాలో చేరే అవకాశం ఉంది.
కొత్త జీఎస్‌టీ ప్రకారం.. 1,200cc లోపు పెట్రోల్, ఎల్‌పీజీ లేదా సీఎన్‌జీ కార్లకు, అలాగే 1,500cc లోపు డీజిల్ కార్లకు 18% జీఎస్‌టీ వర్తిస్తుంది. అయితే, 1,200cc కంటే ఎక్కువ పెట్రోల్ కార్లకు, 1,500cc కంటే ఎక్కువ డీజిల్ కార్లకు 40% జీఎస్‌టీని వర్తింపజేయనున్నారు. ఈ మార్పుల వల్ల ఆటోమొబైల్ రంగంలో భారీ మార్పులు రానున్నాయి. మరి కంపెనీల వారీగా ఏ కారుపై ఎంత ధర తగ్గించారో చూద్దామా..
Also Read
- Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
- Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
Manchu Manoj : మీరు నా వెనకాల ఉంటే నన్ను ఎవరు ఏం చేయలేరు
టాటా మోటార్స్:
టాటా మోటార్స్ తన కార్లపై ధరలను తగ్గించింది. టియాగో రూ. 75,000, టిగోర్ రూ. 80,000, ఆల్ట్రోజ్ రూ. 1.10 లక్షల వరకు ఇదివరకు కంటే చౌకగా లభిస్తాయి. ఎస్‌యూవీల విషయానికి వస్తే, పంచ్ రూ. 85,000, నెక్సాన్ రూ. 1.55 లక్షలు, కర్వ్ రూ. 65,000, ప్రీమియం మోడళ్లైన హారియర్ రూ. 1.40 లక్షలు, సఫారి రూ. 1.45 లక్షల వరకు తగ్గించబడ్డాయి.
మహీంద్రా అండ్ మహీంద్రా:
మహీంద్రా తన ఎస్‌యూవీల శ్రేణిలో ధరలను భారీగా తగ్గించింది. బొలెరో, బొలెరో నియోలు రూ. 1.27 లక్షల వరకు తగ్గాయి. ఎక్స్‌యూవీ3ఎక్స్‌ఓ పెట్రోల్ రూ. 1.40 లక్షలు, డీజిల్ వేరియంట్ రూ. 1.56 లక్షలు తగ్గింది. థార్ 2డబ్ల్యూడీ డీజిల్ రూ. 1.35 లక్షలు, థార్ 4డబ్ల్యూడీ డీజిల్ మరియు స్కార్పియో క్లాసిక్ రూ. 1.01 లక్షలు తగ్గాయి. స్కార్పియో-ఎన్ ధర రూ. 1.45 లక్షలు, ఎక్స్‌యూవీ700 రూ. 1.43 లక్షలు తగ్గించబడింది.
టయోటా:
టయోటా తన కార్ల ధరలను భారీగా తగ్గించింది. ఫార్చ్యూనర్‌పై ఏకంగా రూ. 3.49 లక్షలు, లెజెండర్‌పై రూ. 3.34 లక్షలు, వెల్‌ఫైర్‌పై రూ. 2.78 లక్షలు, హైలక్స్‌పై రూ. 2.52 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హైక్రాస్‌లు రూ. 1.80 లక్షలు, రూ. 1.15 లక్షల వరకు ధరలు తగ్గాయి. గ్లాంజా రూ. 85,300, అర్బన్ క్రూజర్ హైరైడర్ రూ. 65,400 తగ్గించబడ్డాయి.
హ్యుందాయ్:
హ్యుందాయ్ తన అన్ని కార్ల మోడళ్లపై ధరలను తగ్గించింది. గ్రాండ్ ఐ10 నియోస్ రూ. 73,808, ఐ20 రూ. 98,053, ఐ20 ఎన్ లైన్ రూ. 1.08 లక్షలు తగ్గాయి. సెడాన్లలో ఆరా రూ. 78,465, వెర్నా రూ. 60,640 చౌకగా మారాయి. ఎక్స్‌టర్ రూ. 89,209, వెన్యూ, వెన్యూ ఎన్ లైన్ రూ. 1.23 లక్షల వరకు తగ్గాయి. క్రెటా, క్రెటా ఎన్ లైన్‌లపై రూ. 72,000, అల్కాజర్‌పై రూ. 75,376, టక్సన్‌పై రూ. 2.40 లక్షల వరకు తగ్గింపు లభించింది.
Crime News: అంబర్ పేట్‌లో దారుణం.. భార్యపై కన్నేశాడని స్నేహితుడిని..!
రెనాల్ట్:
రెనాల్ట్ తన మూడు మోడళ్లపై జీఎస్‌టీ ప్రయోజనాలను కస్టమర్లకు అందించింది. క్విడ్, ట్రైబర్, కైగర్‌లపై రూ. 96,395 వరకు తగ్గింపును అందించింది.
తాజావార్తలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!