Cannes 2024: పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన తొలి చిత్రం... ఈ ముప్పై సంవత్సరాలలో మొదటి భారతీయ చిత్రంగా కేన్స్‌కు చేరుకుంది. ఫెస్టివల్ ప్రధాన పోటీలో పాల్గొన్న భారతీయ మహిళా దర్శకుడి మొదటి చిత్రం ఇదే.
Indian Movie in Cannes Film Festival 2024 Competition: ఫ్రాన్స్ వేదికగా 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది. మే 14న ఆరంభం అయిన ఈ వేడుక.. మే 25 వరకు కొనసాగనున్నాయి. ఈ వేడుకల్లో దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఓ భారతీయ చిత్రం కాంపిటీషన్‌లో ఉంది. కేన్స్ ఉత్సవంలో ప్రధాన విభాగమైన ‘పామ్ డి ఓర్’ అవార్డుల కేటగిరీలో మలయాళీ చిత్రం ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ పోటీలో నిలిచింది.…
యావత్తు సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’ 2024కు బాలీవుడ్ భామ కియారా అద్వానీ హాజరుకానున్నారు. ఉమెన్ ఇన్ సినిమా గాలాలో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఓ నివేదిక ప్రకారం.. కేన్స్ 2024లో రెడ్ సీ ఫిల్మ్ ఫౌండేషన్ ‘ఉమెన్ ఇన్ సినిమా గాలా డిన్నర్’లో కియారా పాల్గొననున్నారు. ఇదివరకు ఐశ్వర్య రాయ్, అనుష్క శర్మ, సోనమ్ కపూర్, దీపికా పదుకొణె, సారా అలీ ఖాన్.. వంటి బాలీవుడ్ హీరోయిన్స్ కేన్స్…