Kiara Advani: ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’ 2024లో కియారా అద్వానీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యావత్తు సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’ 2024కు బాలీవుడ్ భామ కియారా అద్వానీ హాజరుకానున్నారు. ఉమెన్ ఇన్ సినిమా గాలాలో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఓ నివేదిక ప్రకారం.. కేన్స్ 2024లో రెడ్ సీ ఫిల్మ్ ఫౌండేషన్ ‘ఉమెన్ ఇన్ సినిమా గాలా డిన్నర్’లో కియారా పాల్గొననున్నారు. ఇదివరకు ఐశ్వర్య రాయ్, అనుష్క శర్మ, సోనమ్ కపూర్, దీపికా పదుకొణె, సారా అలీ ఖాన్.. వంటి బాలీవుడ్ హీరోయిన్స్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 77వ ఎడిషన్ మే 14 నుండి 25 వరకు జరగనుంది.
రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్ ప్యానెల్‌లో కియారా అద్వానీ, సల్మా అబు దీఫ్, సరోచా చంకిమ్హా, అధ్వా ఫహద్, అసీల్ ఒమ్రాన్, రమతా టౌలే సై పాల్గొంటారు. వినోద రంగానికి వీరి సహకారాన్ని గుర్తిస్తుంది. గ్లోబల్ ఇన్సెంటివ్‌లు, చిత్రీకరణ గురించి నాలుగు ప్యానెల్ చర్చలు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో జరుగుతాయని వానిటీ ఫెయిర్ పేర్కొంది. మే 18న లా ప్లేజ్ డెస్ పామ్స్‌లో ఈ ఫెస్టివల్ జరుగుతుంది.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
Also Read: Team India Head Coach: హెడ్ కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులు.. అర్హతలు ఇవే!
లోరియల్‌కి అంబాసిడర్‌లుగా ఉన్న ఐశ్వర్య రాయ్, అదితి రావు హైదరీ కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో సందడి చేయనున్నారు. ఐశ్వర్య కేన్స్‌కు రెగ్యులర్‌గా హాజరవుతుండగా.. అదితి 2022లో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్‌లో తన అరంగేట్రం చేశారు. భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాలతో తెలుగు అభిమానులకు కియారా అద్వానీ దగ్గరయ్యారు. ఇప్పుడు ఆమె గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. 2014లో ఫగ్లీ సినిమాతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన కియారా.. లస్ట్ స్టోరీస్, కబీర్ సింగ్, సత్యప్రేమ్ కీ కథా, భూల్ భూలయ్యా 2, వార్ 2, షేర్షా, ఎంఎస్ ధోనీ లాంటి హిట్ సినిమాలో నటించారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!