ఓ వైపు కోవిడ్ మహమ్మారితో యుద్ధం చేస్తుంటే మరో వైపు ఇతర వ్యాధుల పెరుగుదల, మరణాలు ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. తాజాగా తెలంగాణపై క్యాన్సర్ పంజా విసురుతోంది. ప్రతీ ఏటా బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఎంతగా పెరుగుతోందంటే గత 30 ఏళ్లలో 50 శాతం క్యాన్సర్ కేసులు పెరిగాయని నిపుణులు హెచ్చరించారు. పట్టణ జనాభాలో రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తులు, గర్భాశయం,అన్నవాహిక క్యాన్సర్లు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరించారు. 1990లో ఉమ్మడి ఏపీలో ఒక లక్షమంది జనాభాకు 54 క్యాన్సర్ రోగులు…