సాధారణ రోజుల్లో బయటకు వస్తే ట్రాఫిక్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. గంటల తరబడి ట్రాఫిక్‌లో ఆగిపోవాల్సి వస్తుంది. మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. హాలీవుడ్ సినిమాల్లో చూపించే విధంగా ఎగిరే కార్లు వస్తే ట్రాఫిక్ కష్టాలు తీరిపోతాయి కదా అనుకున్నాం. కాగా, త్వరలోనే రోడ్లమీద ఎగిరేకార్లు రాబోతున్నాయి. రోడ్డుపై ప్రయాణం చేస్తున్న కారు రెండు నిమిషాల్లో విమానం మాదిరిగా మారిపోయి ఆకాశంలో ఎగిరిపోతుంది. స్లోవేకియా రాజదాని బ్లాటిస్లావాలోని అంతర్జాతీయ…