ప్రముఖ కథానాయిక అమలాపాల్ పుట్టిన రోజు సందర్భంగా నిన్న ఆమె తాజా చిత్రం ‘కడవెర్’ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. విశేషం ఏమంటే… ఈ సినిమాకు అమలాపాల్ నిర్మాత కూడా! తాను చిత్రసీమలోకి అడుగు పెట్టి 12 సంవత్సరాలు అయ్యిందని అమలాపాల్ తెలిపింది. ’12 యేళ్ళు, 144 నెలలు, 4380 రోజులను ఈ రంగంలో పూర్తి చేశాను. ఇదో గొప్ప అనుభూతి. ఈ అనుభవంతో మరింతగా చిత్రసీమలోకి విస్తరించడానికి నిర్మాతగా మారి సొంత ప్రొడక్షన్…