Telio EV CEO Amit Singh: విద్యుత్ వాహనాల ఛార్జింగ్ సర్వీసుల విషయంలో తమ సంస్థ భవిష్యత్తులో ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా లీడింగ్‌లో ఉంటుందని ‘టెలియొ ఈవీ’ సీఈఓ అమిత్ సింగ్ తెలిపారు. ఈవీ సెగ్మెంట్‌లో మరింత మంచి మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈవీలు ఎక్కువ ఉంటే ఛార్జింగ్ స్టేషన్లు లేవని, ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కువ ఉంటే వాటికి తగ్గ వాహనాలు లేవని చెప్పారు.