Sri Lanka: శ్రీలంకలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం శ్రీలంకలోని తేయాకు పండించే కొండ ప్రాంతంలో ఒక ప్రయాణికుల బస్సు కొండపై నుంచి జారిపడి 21 మంది మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో 36 మంది గాయపడ్డారని అక్కడి అధికారులు తెలియజేశారు. ఈ ప్రమాదం దేశ రాజధాని కొలంబోకు తూర్పున 140 కి.మీ దూరంలో ఉన్న కోట్మలే పట్టణానికి సమీపంలో, ఈ రోజు తెల్లవారుజామున జరిగింది.