అది 2015 నవంబర్. చిత్తూరు మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్‌లను మున్సిపల్ కార్యాయలంలోనే ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన అప్పట్లో పెద్ద సంచలనం. కటారి దంపతుల దగ్గరి బంధువైన చింటూనే కీలక సూత్రధారిగా అభియోగాలు నమోదు చేశారు పోలీసులు. కోర్టు విచారణలో ఉన్న కేసును ఈ నెల 30కి వాయిదా వేశారు. విచారణలో భాగంగా సాక్ష్యులకు సమన్లు వెళ్లాయి. ఇదే కేసులో వైసీపీ నేత బుల్లెట్ సురేష్ కూడా నిందితుడిగా ఉన్నారు.…