కన్నడ నటుడు కిరణ్ రాజ్ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతోన్నాడు. కన్నడలో రీసెంట్‌గా వచ్చిన ‘బడ్డీస్’ సినిమాతో కిరణ్ రాజ్ హీరోగా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ విజయోత్సాహంతోనే కిరణ్ రాజ్ తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. కిరణ్ రాజ్ హీరోగా కుమారి సాయి ప్రియ సమర్పణలో కణిదరపు రాజేష్, పి. ఉషారాణి ‘విక్రమ్ గౌడ్’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. పాశం నరసింహారావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీపికా సింగ్ హీరోయిన్ గా…