MP Dr. Laxman: బూతద్దం పెట్టీ వెతికినా.. మోడీకి సరి తూగే వ్యక్తి దొరకరని రాజ్యసభ ఎంపీ డా. లక్ష్మణ్ అన్నారు. ముషీరాబాద్ బీజేపీ యువ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ..
G. Kishan Reddy: దేశానికి ప్రధాని ఎవరు కావాలి.? మోడీనా.? రాహుల్ గాంధీనా.? అని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అద్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈనెల పదవ తేదీన మోడీ హైదరాబాద్ కు వస్తున్నారని తెలిపారు.
సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి టీ. పద్మారావు గౌడ్ కి మద్దతుగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని రామ్ నగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు.
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదని చెప్పారు. కాంగ్రెస్ కు ఓటేస్తే మిగిలేది గాడిద గుడ్డేనని విమర్శించారు. కాంగ్రెస్ హస్తం భస్మాసుర హస్తమని తెలిసేసరికి గుర్తును గాడిద గుడ్డుగా మార్చారా? అని ప్రశ్నించారు. గాడిద గుడ్డు మీదున్న…
కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రసమయి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాక ముందు ఆంధ్రా పేపర్లు ఉద్యమాన్ని కింద మీద చేశారని ఆరోపించారు. వాళ్ళు అడిగితే ఒకటే మాట చెప్పినా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వెళుతున్నా.. తెలంగాణ…
పార్లమెంట్లో ప్రజల గొంతుకగా నిలిచేందుకే తనకు మద్దతు తెలపాలని.. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి తీగుల్ల పద్మారావు గౌడ్ ఓటర్లకు పిలుపునిచ్చారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఇతర నేతలతో కలిసి రాంగోపాల్ పేట్, నల్లగుట్ట, కాచిబౌలి, గైదన్ భాగ్ బస్తీలలో పద్మారావు గౌడ్ విస్తృతంగా పర్యటించారు.
కరీంనగర్ లోని అంబేడ్కర్ స్టేడియంలో వాకర్స్ ను కలిసి బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఎలక్షన్ ప్రసారం నిర్వహించారు. వాకర్స్ క్రీడాకారులను కలిసి తమకు ఓటు వేయాలంటూ క్రికెట్, వాలీబాల్ ఆడారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జగిత్యాల పట్టణంలో నేడు (ఆదివారం) పర్యటించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డికి మద్దతుగా పట్టణంలో నిర్వహించే రోడ్డు షోలో పాల్గొననున్నారు.