తెలంగాణలో కాసేపట్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. అక్కడక్కడా చెదురు ముదురు ఘటనలు మినహా రాష్ట్రంలో పోలింగ్ కొనసాగింది. ఓటర్లు ఉత్సాహంగా తరలి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 5గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదైంది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రాష్ట్రంలో మూడు గంటల వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 52.30 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రాష్ట్రంలో ఒకట్రెండు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం జరుగుతున్నట్లు సీఈవో వికాస్‌రాజ్ వెల్లడించారు.
నల్గొండ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. పార్లమెంట్ ఎన్నికలకు అధికార యంత్రంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నల్గొండ లోక్ సభ లో పురుషుల కంటే మహిళ ఓట్లే అధికం ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
పదేళ్ల నిజం కేసీఆర్ పాలన, పదేళ్ల విషం బీజెపీ పాలన.. 150 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి పాలన అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం వీటి మధ్యనే పోటీ జరుగుతుందని స్పష్టం చేశారు. కేసీఆర్ మాట్లాడుతూ.."నరేంద్రమోడీ వస్తె కాలేజులు కట్టిన, రోడ్లు వేసిన అని చెప్పాలే.
రోజు రోజుకు బీజేపీ పట్ల సానుకూలత పెరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. సికింద్రాబాద్ లో ఆయన మాట్లాడుతూ.. కంటోన్మెంట్ లో ఓటుకు రూ. 2000 పంచుతూ ప్రజలను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ నేతలు వ్యాపారులను బెదిరించి రూ. కోట్లు వసూలు చేస్తున్నారని.. ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ అభ్యర్థి నగేష్, మరో నేత అశోక్ లు కలిసి చందాల దందా చేస్తున్నారని మాజీ మంత్రి జోగు రామన్న సంచలన ఆరోపణలు చేశారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మరావు గౌడ్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో భారీ ర్యాలీతో అదరగొట్టారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర ఇవాళ సిద్దిపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా అంబేడ్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్‌లో కేసీఆర్ మాట్లాడుతూ.. ఒకనాడు ఇదే అంబేద్కర్ చౌరస్తాలో కరీంనగర్ పోతుంటే ధైర్యం ఇచ్చి పంపిన గడ్డ సిద్దిపేట అడ్డ అని ఆయన అన్నారు. సిద్దిపేట కన్నబిడ్డను కాబట్టి సిద్దిపేట కి వందనమని, ఈ ఎన్నికల్లో మూడు పార్టీలు మీ ముందు ఉన్నాయన్నారు కేసీఆర్. బీజేపీ అజెండాలో ఏనాడు పేదల అవస్థలు ఉండవు…ఎంతసేపు అది…