BRS Party: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయా పార్టీల నేతలు తమ అభ్యర్థుల ఎంపికలో బిజీబిజీగా ఉన్నారు. మొత్తం 17 పార్లమెంటరీ స్థానాలకు గానూ పార్టీలు ఇప్పటికే పలువురు అభ్యర్థులను ప్రకటించాయి. అయితే తాజాగా తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కసరత్తు చేస్తోంది. కాగా.. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయనున్న మరో ఇద్దరు పార్లమెంట్ అభ్యర్థులను అధినేత కేసీఆర్ ప్రకటించారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను కేసీఆర్ ఖరారు చేశారు. అలాగే… మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్ అధికారి పి.వెంకట్రామ్ రెడ్డిని ఖరారు చేశారు.
Read also: BRS MPS: ఇదంతా కక్ష సాధింపే.. కవిత అరెస్టుపై బీఆర్‌ఎస్ ఎంపీలు ఫైర్
ఈ మేరకు బీఆర్ ఎస్ అభ్యర్థిగా అధినేత కేసీఆర్ ను ప్రకటించారు. బీఆర్‌ఎస్ ఇప్పటివరకు 13 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. 4 స్థానాలకు అభ్యర్థులు పెండింగ్‌లో ఉన్నారు. భువనగిరి, నల్గొండ, సికింద్రాబాద్, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులు పెండింగ్‌లో ఉన్నారు. ఈ నాలుగు స్థానాలకు అభ్యర్థులను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. మహబూబ్ నగర్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్, ఖమ్మం నుంచి నామా నాగేశ్వర్ రావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవితా ర్ధన్, వరంగల్ నుంచి కడియం కావ్య పోటీ చేయనున్నారు.
Mayor Vijayalakshmi: కాంగ్రెస్ లో చేరనున్న నగర మేయర్ విజయలక్ష్మి..?